Loading...
Irummudi: 'బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ 'ఇరుముడి'!
'బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ 'ఇరుముడి'!

Irummudi: 'బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ 'ఇరుముడి'!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 30, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్‌ వద్ద రవితేజ నటించిన 'ఇరుముడి' జోరు చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. సాధారణంగా సినిమా విడుదలైన కొద్దిరోజులకు వసూళ్లు క్రమంగా తగ్గుతుంటాయి. భారీ సినిమాల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే 'ఇరుముడి' విషయంలో మాత్రం సీన్‌ పూర్తిగా భిన్నంగా ఉంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా రెండో శుక్రవారం 'ఇరుముడి' సాధించిన వసూళ్లు ఇప్పుడు టాలీవుడ్‌లోని పలు భారీ బ్లాక్‌బస్టర్‌ సినిమాల రికార్డులను గుర్తు చేస్తున్నాయి.

వివరాలు

ఇరుముడి ప్రత్యేకత అదే..

ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. రెండో శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.12 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఇదే రోజున 'ఆర్ఆర్ఆర్' సుమారు రూ.15 కోట్ల వసూళ్లు సాధించింది.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' రెండో శుక్రవారం సుమారు రూ.10.5 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి.

ఇక అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప 2' రెండో శుక్రవారం దాదాపు రూ.9 కోట్లు, ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' సుమారు రూ.7 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కలతో పోలిస్తే.. 'ఇరుముడి' రెండో శుక్రవారం రూ.12 కోట్ల గ్రాస్‌ రాబట్టడం విశేషంగా మారింది.

వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు..

విడుదలైన తొలి వారంలోనే 'ఇరుముడి' తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టింది.

దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదవడంతో.. మొదటి రోజు నుంచే సినిమాకు పాజిటివ్‌ ట్రెండ్‌ ఏర్పడింది.

ఇప్పటికే ఈ సినిమా దేశీయ బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్ల నెట్‌ మార్క్‌ను దాటేసింది.

విడుదలైన ఎనిమిదో రోజుకే ఈ మైలురాయిని అందుకోవడం.. సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా కనిపిస్తోంది.

అంతేకాదు.. ఈ మూవీ ఇప్పటికే రూ.150 కోట్ల మార్క్‌ను దాటి.. త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరే దిశగా దూసుకెళ్తోంది.

తొలి వారంలోనే భారీ వసూళ్లు సాధించిన 'ఇరుముడి'.. రెండో వారంలోనూ అదే జోరును కొనసాగించడం ఇప్పుడు ట్రేడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

రవితేజ కెరీర్‌లో కొత్త రికార్డులు..

మొత్తంగా చూస్తే.. కేవలం మంచి ఓపెనింగ్స్‌తో ఆగిపోకుండా రెండో వారంలోనూ 'ఇరుముడి' బాక్సాఫీస్‌ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.

'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌కు చేరువగా రెండో శుక్రవారం వసూళ్లు సాధించడం.. 'బాహుబలి 2', 'పుష్ప 2', 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాల కంటే మెరుగైన లెక్కలు నమోదు చేయడం రవితేజ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ఇదే జోరు కొనసాగితే 'ఇరుముడి' రవితేజ కెరీర్‌లో మరిన్ని కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT