Ravi Teja Cinema : రాయలసీమ యాస నేర్చుకుంటున్న రవితేజ.. ఎందుకో తెలుసా
టాలీవుడ్ మాస్ మహారాజా, హీరో రవితేజ తెలుగు ప్రేక్షకులను సరికొత్త కథతో కనువిందు చేయనున్నారు. ఈ మేరకు అభిమానులకు పండుగ లాంటి విషయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనేే రవితేజ కొత్త సినిమా రాయలసీమ నేపథ్యంలో తీయనున్నట్లు తెలుస్తోంది. మాస్ మహా రాజు రవితేజ హీరోగా ఇప్పటికే డాన్ శ్రీను, బలుపు, క్రాక్ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలోనే సాగనుందట. ఇదే సమయంలో రవితేజ, ఈ సినిమా కోసం రాయలసీమ మాండలికంలో డైలాగ్స్ చెప్పబోతున్నారని సమాచారం.
త్వరలోనే అధికారిక ప్రకటన
ఈ కొత్త సినిమాలో మాస్ మాహారాజా డైలాగ్స్ ఆసక్తికరంగా ఉండనున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో రవితేజ చాలా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ కొత్త సినిమా ఈగిల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.