LOADING...
Ravi Teja: రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు 'వీరాధి వీరులంట' టైటిల్‌?
రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు 'వీరాధి వీరులంట' టైటిల్‌?

Ravi Teja: రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు 'వీరాధి వీరులంట' టైటిల్‌?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 11, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ, యువ కథానాయకుడు శ్రీవిష్ణు కలిసి ఓ ప్రతిష్ఠాత్మక మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సినిమాకు దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌కు 'వీరాధి వీరులంట' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే టైటిల్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

వివరాలు

చివరి దశ పనుల్లో ఇరుముడి మూవీ..

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రవితేజ ప్రస్తుతం నటిస్తున్న 'ఇరుముడి' చిత్రం చివరి దశ పనుల్లో ఉంది. ఈ సినిమా వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.

Advertisement