
Coolie:రికార్డులు బద్దలయ్యాయి.. కూలీ మూవీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రజనీకాంత్ ప్రధాన పాత్రలో, నాగార్జున విలన్‌గా నటించిన 'కూలీ' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈ సినిమా మిశ్రమ స్పందన పొందింది. ప్రారంభంలో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కొందరు విమర్శకులు "ఇది రజనీకాంత్ చేయాల్సిన సినిమా కాదు, లోకేష్ కనకరాజు స్థాయికి తగ్గ ప్రాజెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, నాగార్జున పాత్ర విషయంలోనూ ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. "నాగార్జున ఇలాంటి పాత్ర చేయాడని ఊహించలేదు" అని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు "ఇందులో కొత్తగా ఏమీ లేదు, రొటీన్ విలన్ పాత్రే కదా" అని కామెంట్ చేశారు.
Details
రజనీకాంత్ తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం
ఈ విమర్శలపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని అన్నపూర్ణ స్టూడియో ద్వారా విడుదలైన అధికారిక ప్రకటనలో, "రజనీకాంత్‌తో కలిసి 'కూలీ'లో పని చేయడం ఒక మరపురాని అనుభవం. మా విభిన్న సినీ ప్రయాణాలు తెరపై కలిసినప్పుడు ఒక మాగ్నెటిక్ మ్యాజిక్ సృష్టైంది. ఈప్రాజెక్ట్‌లో భాగమని తెలుసుకున్నప్పుడు మేము ప్రత్యేకమైన అనుభూతిని పొందాం. నా పాత్రకు వచ్చిన ప్రేక్షక స్పందన అద్భుతంగా ఉందని నాగార్జున తెలిపారు. అంతేగాక, ఒక గొప్ప సినిమా ప్రధానంగా నటుల మధ్య కెమిస్ట్రీ, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే థ్రిల్‌పై ఆధారపడుతుందని వివరించారు. 'కూలీ' సెట్స్ నుంచి థియేటర్ల వరకు ఒక వారసత్వం,రీక్రియేషన్ వేడుకగా మారింది. రికార్డులు బద్దలు కొట్టాలని భావించాము, అవి నిజంగా బద్దలయ్యాయని నాగార్జున అభిప్రాయపడ్డారు.