Jai Hanuman: 'జై హనుమాన్ ' చిత్రంలో కన్నడ స్టార్ హీరో.. ప్రశాంత్ వర్మ ప్లాన్ తో దద్దరిల్లనున్న థియేటర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది సంక్రాంతికి భారీ సినిమాలతో పోటీకి దిగుతూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా 'హను-మాన్'.
ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్ధలు కొట్టింది.
సుమారు రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. మొదటి భాగానికి మించిన ఈ సినిమా ఉంటుందని చెప్పారు.
అయితే, ఇప్పటి వరకు పెద్దగా అప్‌డేట్స్ రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
వివరాలు
మెయిన్ లీడ్‌గా 'జై హనుమాన్'లో కన్నడ స్టార్ హీరో
ప్రస్తుతం 'జై హనుమాన్' సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఇప్పటివరకు ఈ మూవీలో నటించబోయే యాక్టర్ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా,ఈ చిత్రంలో ఒక కన్నడ స్టార్ హీరో మెయిన్ లీడ్ పోషించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన మరెవరో కాదు,'కాంతార' హీరో రిషబ్ శెట్టి. ప్రశాంత్ వర్మ మాదిరిగా, రిషబ్ కూడా 'కాంతార' సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఆయన 'కాంతార 2' కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో,రిషబ్ శెట్టి 'జై హనుమాన్'లో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
'జై హనుమాన్' సినిమాలో మెయిన్ లీడ్‌ను ఎవరి ఊహలకు అందకుండా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో హనుమాన్,రాముడి పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం.
వివరాలు
'జై హనుమాన్' థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?
అయితే, రిషబ్ శెట్టి ఈ మూవీలో రాముడిగా కనిపిస్తారా? లేక హనుమంతుడిగా కనిపిస్తాడా? అనేది త్వరలోనే తెలియనుంది.
త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తున్నారు.
'జై హనుమాన్' సినిమాను వెండితెరపై సరికొత్తగా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీలో భారీ ఎత్తున వీఎఫ్ఎక్స్ ఉపయోగించనున్నారు.
ఈ పనుల కోసం చాలా టైం పట్టే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు కనిపించడం లేదు.
నిజానికి, ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేసేందుకు 'హనుమాన్' సినిమా సమయంలో ప్రకటించారు.
కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు.
వివరాలు
వరుస ప్రాజెక్టులతో ప్రశాంత్ వర్మ బిజీ
'హనుమాన్' క్రేజ్ తో ప్రశాంత్ వర్మ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. PVCU నుంచి కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే ప్రముఖ నిర్మాత దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి హీరోగా 'అధీరా' అనే సినిమా ప్రకటించారు.
నందమూరి మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నారు. 'మహాకాళి' అనే లేడీ సూపర్ హీరో మూవీని కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు సమాచారం.