RJ Mahvash: యుజ్వేంద్ర చాహల్ తో డేటింగ్ కథనాలు .. మహ్‌వశ్ ఆసక్తికర పోస్ట్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్,రేడియో జాకీ మహ్‌వశ్ డేటింగ్‌లో ఉన్నారన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే మహ్‌వశ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో తనకు "బెస్ట్ మెగా ఇన్‌ఫ్లుయెన్సర్"అవార్డు లభించడంతో ఆమె స్పందిస్తూ, "నన్నుఈ స్థాయికి చేరుకున్నట్లు చూడగానే చిన్ననాటి మహ్‌వశ్ ఎంతో గర్వపడుతుంది.ఇది నాకు చాలా ప్రత్యేకమైన విజయం.ఎలాంటి తప్పులు చేయకుండా,అసత్యాలకు లొంగకుండా,మన పని మనం నిబద్ధతతో కొనసాగించాలి"అని పేర్కొన్నారు.
ప్రస్తుతం డేటింగ్ వార్తలు హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఆమె పెట్టిన ఈ పోస్ట్‌కు ప్రాధాన్యత పెరిగింది.
కొందరు ఈ వ్యాఖ్యలను ఆమెపై వస్తున్న రూమర్లకు ప్రత్యక్ష సమాధానంగా భావిస్తున్నారు.
వివరాలు
సోషల్‌మీడియాలో పెరిగిన ఫాలోవర్స్
ఇదిలా ఉండగా,చాహల్ తన భార్య ధనశ్రీతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను మహ్‌వశ్, చాహల్ కలిసి వీక్షించారు.
మ్యాచ్‌కు ముందు మహ్‌వశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు.
ఇది తొలిసారి కాదు
గతేడాది డిసెంబరులోనూ చాహల్‌తో కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు.అప్పట్లోనూ వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి.అయితే,మహ్‌వశ్ వాటిని ఖండిస్తూ,"ఇవి అన్ని అసత్య వార్తలు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించకండి" అంటూ పేర్కొన్నారు.
అయితే, ఈ వార్తలు మళ్లీ తెరపైకి రావడంతో మహ్‌వశ్ సోషల్‌మీడియాలో మరింత పాపులర్ అయ్యారు, ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది.