
Robinhood : 'రాబిన్‌హుడ్' ఓటీటీలో వచ్చేస్తోంది.. మిస్ అవ్వకండి!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా సినిమా 'రాబిన్ హుడ్'.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల, నిర్మాణ బాధ్యతలు మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారు. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, భారీ హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయితే కథాంశం రోటీనుగా ఉండటం, అంతగా ఆసక్తికరంగా సాగకపోవడం, ముఖ్యంగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్రను పూర్తిగా ప్రదర్శించకపోవడం వంటి అంశాల వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించింది.
రిలీజ్ ముందు భారీగా ప్రమోషన్ చేసినా ఫలితం దక్కలేదు.
Details
డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జీ5
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, చంద్ర ప్రసాద్, దేవ దత్త, రాజేంద్ర ప్రసాద్ వంటి పలువురు నటులు తమ కామెడీతో అలరించినా, ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఇప్పటికే వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న నితిన్, శ్రీలీలకు ఇది మరో డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికపైకి రావడానికి సిద్ధమవుతోంది.
జీ5 ఈ సినిమాకు డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది. ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం, ఈ మూవీ మే 2న స్ట్రీమింగ్‌కు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అంటే, థియేటర్లలో విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో మ్యాజిక్ చేస్తుందేమో వేచి చూడాలి.