
Robinhood: జీ5లో'నితిన్' రాబిన్‌హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రాబిన్‌హుడ్ (Robinhood)'. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'భీష్మ' చిత్రం విజయవంతమైన నేపథ్యంలో, ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
2024 మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను పొందింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది.
వివరాలు
జీ 5 ఛానల్‌లో, ఓటీటీలో..
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'జీ 5' (Zee5) ఈ సినిమాను ప్రసారం చేయబోతుంది.
'సంక్రాంతి వస్తున్నాం' సినిమాను జీ 5 ఛానల్‌లో, ఓటీటీలో ఒకేసారి విడుదల చేసిన విధానాన్ని అనుసరిస్తూ, 'రాబిన్‌హుడ్' సినిమాను కూడా అదే రీతిలో విడుదల చేయనుంది.
ఈ చిత్రం మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు టీవీ ప్రీమియర్‌గా ప్రసారమవుతుంది.
అదేరోజు లేదా ఆ మరుసటి రోజు నుంచి ఈ చిత్రం ఓటీటీలో కూడా అందుబాటులోకి రానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జీ5 తెలుగు చేసిన ట్వీట్
The Big news!
— ZEE5 Telugu (@ZEE5Telugu) May 6, 2025
The talk of the town #Robinhood will see you on 10th May @ 6pm
Get Ready!@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash #RajendraPrasad @vennelakishore @DevdattaGNage #SaiSriram @EditorKoti #RaamKumar @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/jHINGalYnu