Prabhas: హాలీవుడ్ స్థాయిలో స్పిరిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్.. బడ్జెట్ ఎంతంటే ..?
సలార్, కల్కి 2898 AD వంటి వరుస విజయాల తర్వాత ప్రభాస్ తన సినిమాల వేగాన్ని మరింత పెంచారు. ప్రస్తుతం ఒకేసారి పలు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్, సలార్ పార్ట్ 2తో పాటు కల్కి సీక్వెల్‌లో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అదనంగా, తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాను కూడా ప్రారంభించాడు. ఇవి కాకుండా,ప్రభాస్ మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ 'స్పిరిట్'లో నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి,యానిమల్ వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాకపోయినప్పటికీ, ప్రతిరోజూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
తొలిసారిగా పోలీస్ పాత్రలో ప్రభాస్
ఈ సినిమాను సందీప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు, అందుకే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని, సందీప్ వంగ కెరీర్‌లో ఇదే అతిపెద్ద బడ్జెట్ సినిమా అని చెబుతున్నారు. ప్రభాస్ మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుతోంది.
హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు
ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ తో నిర్మించనున్నారు. కేవలం ఇండియా మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. బడ్జెట్ విషయంలో సందీప్ వంగ కాంప్రమైజ్ అవ్వడం లేదని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 'స్పిరిట్' సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని సాధిస్తుందో, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.