Page Loader
Baahubali TheEpic: 'బాహుబలి' నిడివిపై వదంతలు.. క్లారిటీ ఇచ్చిన రానా!
'బాహుబలి' నిడివిపై వదంతలు.. క్లారిటీ ఇచ్చిన రానా!

Baahubali TheEpic: 'బాహుబలి' నిడివిపై వదంతలు.. క్లారిటీ ఇచ్చిన రానా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన బ్లాక్‌బస్టర్ 'బాహుబలి' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలై దాదాపు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా, 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 5 గంటల పాటు నిడివి ఉంటుందంటూ, మరోవైపు 4 గంటలు అన్నవారూ ఉన్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి, అనుమానాలు రెండూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భల్లాలదేవ పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసిన నటుడు రానా దగ్గుబాటి తాజాగా స్పందించారు.

Details

జూలై 18న కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రిలీజ్

ఈ ఏడాది నేను ఏ సినిమాలో నటించకుండానే ఒక బ్లాక్‌బస్టర్‌ రిలీజ్ కానుండడం ఎంతో ఆనందంగా ఉంది. రన్‌టైమ్ గురించి నాకేమీ తెలియదు. సోషల్ మీడియాలో నాలుగు గంటలు అంటున్నారు. అంత నిడివి ఉంటే ప్రేక్షకులు చూస్తారా? అసలైన నిడివి మాత్రం ఎవరూ అంచనా వేయలేరు. రాజమౌళి మాత్రమే దాన్ని చెప్పగలరు. ఆయన ఆ విషయంలో ఏమీ అప్డేట్ ఇవ్వలేదంటూ రానా క్లారిటీ ఇచ్చేశాడు. రానా నిర్మాతగా వ్యవహరించిన 'కొత్తపల్లిలో ఒకప్పుడు' చిత్రం జులై 18న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రానా మాట్లాడుతూ.. త్వరలోనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' చిత్రానికి చక్కటి కథ ఉందని, ఇది ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన చెప్పారు.