Loading...
Sachin Tendulkar Ranveer Singh: సచిన్‌ సంచలన వ్యాఖ్యలు... రణ్వీర్‌ సింగ్‌ ఓ మంచి ఆటగాడు
సచిన్‌ సంచలన వ్యాఖ్యలు... రణ్వీర్‌ సింగ్‌ ఓ మంచి ఆటగాడు

Sachin Tendulkar Ranveer Singh: సచిన్‌ సంచలన వ్యాఖ్యలు... రణ్వీర్‌ సింగ్‌ ఓ మంచి ఆటగాడు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 22, 2026
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌కు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ నుంచి ఊహించని ప్రశంసలు అందాయి. ముంబైలో జరిగిన 'గ్లోబల్‌ పీస్‌ ఆనర్స్‌ 2026' కార్యక్రమంలో వీరిద్దరూ ఎదురుపడటంతో అక్కడ ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. ముఖ్యంగా 1983 ప్రపంచకప్‌ నేపథ్యంలో తెరకెక్కిన '83' సినిమాలో రణ్‌వీర్‌ పోషించిన కపిల్‌ దేవ్‌ పాత్రను సచిన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆ పాత్రలో రణ్‌వీర్‌ ఒదిగిపోయిన తీరు తనను ఆకట్టుకుందని చెబుతూ, అతడు మంచి క్రికెటర్‌ కూడా కాగలడని సరదాగా వ్యాఖ్యానించాడు.

Details

రణ్‌వీర్‌ ప్రశ్నకు సచిన్‌ అదిరిపోయే సమాధానం!

ఈ కార్యక్రమంలో రణ్‌వీర్‌ సింగ్‌ ఓ ఆసక్తికరమైన ప్రశ్నతో సచిన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు.

'మన పాత్రలు మారిపోతే.. మనలో ఎవరు మంచి క్రికెటర్‌గా, ఎవరు మంచి నటుడిగా రాణిస్తారు?' అని అడిగాడు.

దీనికి సచిన్‌ నవ్వుతూ సమాధానమిచ్చాడు. 'ఇది ఒక గూగ్లీ ప్రశ్న. మీరు సినిమాలో ఫాస్ట్‌ బౌలింగ్‌ చేశారు కదా! ఆ పాత్రలో అద్భుతంగా నటించారు' అంటూ ప్రశంసించాడు.

దీంతో అక్కడి వాతావరణం సరదాగా మారిపోయింది. రణ్‌వీర్‌ నటనపై సచిన్‌కు ఉన్న అభిమానం ఈ మాటల్లో స్పష్టంగా కనిపించింది.

Details

1983 ప్రపంచకప్‌ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న మాస్టర్‌!

సచిన్‌ తన మాటల్లో 1983 ప్రపంచకప్‌ జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకున్నాడు.

అప్పట్లో కపిల్‌ దేవ్‌ను చూస్తూ పెరిగామని, ఆయన ఆట తనలాంటి ఎంతోమంది యువకులకు క్రికెట్‌పై ఆసక్తి పెంచిందని చెప్పాడు.

అందుకే '83' సినిమాలో రణ్‌వీర్‌ నటన చూసినప్పుడు అతడిని నిజమైన క్రికెటర్‌లా ఊహించుకోగలిగానని వివరించాడు.

అంతేకాదు, ఎప్పుడైనా నెట్స్‌కు వచ్చి తనకు బౌలింగ్‌ చేయాలని రణ్‌వీర్‌ను ఆహ్వానించాడు. ఈ మాటలతో నటుడు ఆనందం వ్యక్తం చేశాడు.

ADVERTISEMENT

Details

క్రికెటర్లలోనూ నటులు ఉన్నారన్న సచిన్‌!

సంభాషణలో క్రికెటర్ల నటనా ప్రతిభ గురించి కూడా సచిన్‌ సరదాగా మాట్లాడాడు. హర్భజన్‌ సింగ్‌, శ్రీశాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ వంటి ఆటగాళ్లు సినిమాల్లో కనిపించిన విషయాన్ని ప్రస్తావించాడు.

ఇక కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన '83' సినిమా 1983లో భారత జట్టు సాధించిన తొలి వన్డే ప్రపంచకప్‌ విజయాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

అందులో కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు సచిన్‌ నుంచి వచ్చిన ప్రశంసలు మరోసారి ఆ సినిమా విశేషాలను అభిమానులకు గుర్తుచేస్తున్నాయి.

ADVERTISEMENT