
విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్
ఈ వార్తాకథనం ఏంటి
సాయి ధరమ్ తేజ్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. విరూపాక్ష మూవీని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మళయాలంల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది విరూపాక్ష. ఈ నేపథ్యంలో ట్రైలర్ పై అప్డేట్ వచ్చింది. తాజాగా ఒక పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం, మరికొద్ది రోజుల్లీ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని వెల్లడి చేసింది.
కాకపోతే ఎప్పుడు చేస్తారనేది మాత్రం చెప్పలేదు. ట్రైలర్ అప్డేట్ పై విడుదలైన పోస్టర్ లో భుజానికి రెండు రెక్కలతో కనిపించాడు సాయి ధరమ్ తేజ్.
రెక్కలు కట్టుకుని చేతిలో మండుతున్న కర్ర పట్టుకుని ఎటో తీక్షణంగా చూస్తున్న సాయి ధరమ్ తేజ్ ని, హీరోయిన్ సంయుక్తా గట్టిగా హత్తుకుంది.
విరూపాక్ష
రహస్య ద్వారపు తలుపులు తెరిచేందుకు సిద్ధమైన సాయి ధరమ్ తేజ్
ఈ పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్, ఆసక్తికరమైన క్యాప్షన్ ని తగిలించాడు. రెక్కలు విచ్చుకున్నాయి, కాబట్టి రహస్య ద్వారపు తలుపులు కూడా తెరుచుకోబోతున్నాయి అంటూ క్యాప్షన్ పెట్టాడు.
ఆల్రెడీ రిలీజైన విరూపాక్ష టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఒక గ్రామంలో జరిగే సంఘటనలు అంతుచిక్కనివిగా ఉంటాయి. అవి ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే క్రమంలో సాయి ధరమ్ తేజ్ కు ఎదురైన సవాళ్ళు విరూపాక్షలో కనిపిస్తాయని టీజర్ అర్థమైంది.
విరూపాక్ష చిత్రాన్ని ఎస్వీసీసీ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్
The Wings have opened,
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 5, 2023
So will the doors of the Mystical World.
Stay tuned for the #VirupakshaTrailer 🤞#Virupaksha#VirupakshaOnApril21 pic.twitter.com/J3xUHd4bGs