Page Loader
Siima awards 2025: సైమా 2025 నామినేషన్లు.. పుష్ప2 దుమ్మురేపింది.. 11 విభాగాల్లో దక్కిన గుర్తింపు!
సైమా 2025 నామినేషన్లు.. పుష్ప2 దుమ్మురేపింది.. 11 విభాగాల్లో దక్కిన గుర్తింపు!

Siima awards 2025: సైమా 2025 నామినేషన్లు.. పుష్ప2 దుమ్మురేపింది.. 11 విభాగాల్లో దక్కిన గుర్తింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభను గౌరవించే 'సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2025' వేడుకకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్‌ వేదికగా జరగనున్న ఈ ఘన కార్యక్రమానికి సంబంధించిన నామినేషన్ల జాబితాను సైమా అవార్డుల కమిటీ బుధవారం విడుదల చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోని ప్రముఖ సినిమాలు వివిధ విభాగాల్లో నామినేట్‌ అయ్యాయి. తెలుగు సినిమా విభాగంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం, వరుసగా పలు కేటగిరీల్లో గుర్తింపు పొందింది.

Details

రెండోస్థానంలో హనుమాన్

అదేవిధంగా ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందిన విజన్‌ రిచ్‌ మూవీ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) 10 నామినేషన్లు, తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సూపర్ హీరో ఫిల్మ్ 'హను-మాన్‌' (Hanuman) కూడా 10 నామినేషన్లు సాధించి రెండవ స్థానాన్ని పంచుకున్నాయి. తమిళ చిత్రాలలో శివ కార్తికేయన్‌ నటించిన 'అమరన్‌' చిత్రం 13 నామినేషన్లతో టాప్‌లో నిలవగా, 'లబ్బర్‌ పందు' 8, 'వాళై' 7 నామినేషన్లు సాధించాయి. కన్నడ విభాగంలో 'భీమా', 'కృష్ణ ప్రణయ సఖి' రెండూ 9 నామినేషన్లు, 'ఇబ్బని తబ్బిడ ఇలియాలి' చిత్రం 7 నామినేషన్లు సాధించి పోటీలో నిలిచాయి.

Details

12 ఎడిషన్లను పూర్తి చేసుకున్న సైమా అవార్డ్స్

మలయాళం సినిమాలలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన 'ఆడుజీవితం' (Aadujeevitham) 10 నామినేషన్లతో ముందుంది. అదేవిధంగా 'ఏఆర్‌ఎం' 9, 'ఆవేశం' 8 నామినేషన్లు సాధించాయి. ఇప్పటివరకు 12 ఎడిషన్లను పూర్తిచేసుకున్న సైమా అవార్డ్స్, ఈ ఏడాది 13వ ఎడిషన్‌కు సిద్ధమవుతోంది. దక్షిణాది సినిమాల్లో సాంకేతికత, నటనా ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై మరింత గౌరవం కలిగించే ఈ వేడుకపై సినీప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.