ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ అభిమానులకు ఒకేరోజున రెండు ట్రీట్స్ దొరకబోతున్నాయి. ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల అవుతుందని వినిపిస్తోంది.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం, జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
అదే రోజున సలార్ టీజర్ విడుదల అవుతుందనీ, ఆదిపురుష్ రిలీజ్ అయ్యే అన్ని థియేటర్లలో సలార్ టీజర్ ప్రదర్శించబడుతుందని అంటున్నారు.
ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ సోషల్ మీడియా వేదికగా సలార్ టీజర్ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయమై సలార్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.
Details
సాహో తరహా ఫార్ములాను ఫాలో అవుతున్న ప్రభాస్
గతంలో బాహుబలి 2 సినిమా విడుదలకు ఒకరోజు ముందు సాహో సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు. అదే ఫార్ములాను ఈసారి అప్లై చేయబోతున్నట్లుగా అర్థమవుతోంది.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సలార్ సినిమాలో హీరోయిని గా శృతిహాసన్ కనిపిస్తోంది.
కీలకమైన పాత్రల్లో జగపతి బాబు, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన సలార్ సినిమా విడుదల అవుతుంది.
సలార్ తో పాటు ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ప్రాజెక్ట్ కె, మారుతి డైరెక్షన్ లోని రాజా డీలక్స్ షూటింగుల్లో పాల్గొంటున్నాడు.