Salaar: సలార్ మేకింగ్ వీడియో.. ఎలా కష్టపడ్డారో చూడండి!
రెబర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'సలార్'(Salaar) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీలో జగపతి బాబు, శ్రియా రెడ్డి, శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ మూడు రోజులలో 350 కోట్ల గ్రాస్ సాధించి బాక్స్ ఫీస్ ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు 'సలార్' టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. సలార్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ' సలార్ సీజ్‌ఫైర్' తెరకెక్కించేందుకు నటీనటులు ఎంతలా కష్టపడ్డారో ఇందులో చూపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు యాక్షన్ సన్నివేశాలు ఈ వీడియోలు కనిపించాయి.
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'సలార్'
ఈ వీడియోను క్రిస్మస్ కానుకగా ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 3 రోజుల్లో సలార్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 140 కోట్ల గ్రాస్ అందుకుంది. నాలుగో రోజు మాత్రం కాస్తా డీలా పడింది. రూ. 13.64 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే వచ్చాయి. నాలుగో రోజు సోమవారం కావడం, క్రిస్మస్ పండుగ రావడంతో కాస్త ప్రేక్షకాదరణ తగ్గినట్లు సమాచారం.