Page Loader
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు.. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును ప్రస్తావిస్తూ పాట
సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు.. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును ప్రస్తావిస్తూ పాట

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు.. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును ప్రస్తావిస్తూ పాట

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో సంబంధం ఉన్న ఒక పాటపై సల్మాన్‌ ఖాన్‌ కు బెదిరింపులు వచ్చాయి. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి, సల్మాన్‌ ఖాన్‌ను హెచ్చరించారు. "ఈ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాడు. ఇకపై అతను పాటలు రాయలేకపోతాడు" అని పేర్కొన్న వారు, "ధైర్యం ఉంటే మీకు కావలసిన విధంగా వారిని రక్షించండి" అని హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్‌ ఆధారంగా వర్లీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ప్రకటించారు.

వివరాలు 

సల్మాన్‌ నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు

కాగా, సల్మాన్‌ ఖాన్‌ కు గతంలో కూడా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో, సల్మాన్‌ నివాసం ఉన్న బాంద్రా గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అలాగే, పన్వేల్‌ ఫామ్‌ హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించినపుడు అది పెద్ద దుమారం రేపింది. ఈ తరహా బెదిరింపులు మరింత పెరిగిన నేపథ్యంలో, కర్ణాటకలోని హవేరిలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, రాజస్థాన్‌లోని మరో వ్యక్తిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు అప్పగించారు.

వివరాలు 

షారుక్‌ ఖాన్‌ కి కూడా ఈ తరహా బెదిరింపులు 

అలాగే, బాలీవుడ్‌లో మరో ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కూడా ఇటీవలి కాలంలో ఈ తరహా బెదిరింపులను ఎదుర్కొన్నారు. ముంబయి పోలీసులకు ఒక వ్యక్తి ఫోన్‌ చేసి రూ.50 లక్షలు ఇవ్వకపోతే హానిచేయిస్తామని బెదిరించాడు. ఈ కాల్‌ను ఆరా తీసిన పోలీసులు, ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పుర్‌కు చెందిన ఫైజన్‌ ఖాన్‌ అనే వ్యక్తి పేరు మీద నంబర్‌ రిజిస్టర్‌ అయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.