Page Loader
Salman Khan: సల్మాన్ ఖాన్‌ కు మళ్లీ బెదిరింపులు..'ప్రాణాలతో ఉండాలంటే లారెన్స్ బిష్ణోయ్‌కు రూ. 5 కోట్లు ఇవ్వు '
సల్మాన్ ఖాన్‌ కు మళ్లీ బెదిరింపులు

Salman Khan: సల్మాన్ ఖాన్‌ కు మళ్లీ బెదిరింపులు..'ప్రాణాలతో ఉండాలంటే లారెన్స్ బిష్ణోయ్‌కు రూ. 5 కోట్లు ఇవ్వు '

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ మరోసారి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్నశత్రుత్వానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు చెల్లించాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులు పంపారు. ఈ బెదిరింపు సందేశం ముంబై ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌కు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి ఈ సందేశం పోలీసులకు చేరింది.

వివరాలు 

మెసేజ్‌ ఎక్కడినుంచి వచ్చిందన్న విషయంపై విచారణ

సందేశంలో, "ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్‌ ఖాన్‌ జీవితం కాపాడాలన్నా, లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో విభేదాలను పరిష్కరించాలన్నా రూ.5 కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే, ఇటీవల హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే కూడా దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది," అని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు, మెసేజ్‌ ఎక్కడినుంచి వచ్చిందన్న విషయంపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.