
సింగర్ చిన్మయి పిల్లలతో నాటు నాటు పాటకు డాన్స్ చేయించిన సమంత
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియా పర్యటనలో ప్రకృతిలో పరవశించిన సమంత, ప్రస్తుతం అక్కడి నుండి తిరిగి ఇండియాకు వచ్చేసింది. బాలి నుండి నేరుగా చెన్నై చేరుకున్న సమంత, సింగర్ చిన్మయి ఇంటికి చేరుకుంది.
సమంతకు తెలుగులో చిన్మయి డబ్బింగ్ చెబుతుందని, అలాగే చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ తో సమంతకు మంచి స్నేహం ఉందని తెలిసిందే.
చిన్మయి ఇంట్లో దిగిన సమంత, చిన్మయి పిల్లలను ఆడిస్తూ ఉంది. ఆ పిల్లలతో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించింది. ఇప్పుడు ఆ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
పిల్లలతో ఆడిపాడిస్తూ తాను కుడా చిన్నపిల్లలా మారిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Details
సెప్టెంబర్ 1న విడుదలవుతున్న ఖుషి
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత అమెరికాలో మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుందని అన్నారు. కానీ ఇండోనేషియా వెళ్ళిన సమంత, తిరిగి ఇండియాకు వచ్చేసింది.
మరి చికిత్స కోసం అమెరికాకు వెళ్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి తెలియదు.
సమంత నటించిన ఖుషీ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు.
అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటించింది. మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిన్మయి పిల్లలతో సరదాగా ఆడుతున్న సమంత
Always a Child 🤍🥹
— SAM ARMY || KnowUrStarSAM™ (@KnowUrStarSAM) August 6, 2023
Our Cutie @Samanthaprabhu2 with @Chinmayi & @23_rahulr kids ❤️🫶#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/itrPdoB1H7