Samantha: చైతు,శోభిత నిశ్చితార్థం.. సమంత షాకింగ్ డెసిషన్.. ఇక సినిమాలు చేయనంటూ . .
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉంది. ఆరోగ్య సమస్యలు ఓ కొలిక్కి వచ్చాక 'శాకుంతలం'సినిమా చేసింది సమంత .అయితే ఆ సినిమా అనుకునేంత సక్సస్ కాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ చేసింది. అనంతరం విజయ్ దేవరకొండతో చేసిన 'ఖుషీ' సినిమా మంచి విజయం అందుకుంది. అయితే 'ఖుషీ' తర్వాత సమంత, మరో తెలుగు సినిమా అనౌన్స్ చేయలేదు. కాగా, సమంత ప్రస్తుతం వీటన్నింటినీ మరిచిపోయి సినిమాల్లో బిజీ అవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే సమంత ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుందని టాక్.
తెలుగు ఇండస్ట్రీకి దూరంగా..
ఇక పై తెలుగు సినిమాలలో చెయ్యకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దానికి కూడ ఒక కారణం ఉందంట అదేంటంటే .. ఎన్ని తెలుగు సినిమాలు చేసినా, తన పర్సనల్ లైఫ్ తో ముడిపెట్టి చూస్తున్నారని, తన వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని సమంత బాధపడుతోందట. అంతేనా . . ఇటీవల తన మాజీ భర్త చైతు ,శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం, రెండో పెళ్లికి సిద్ధం కావడంతో సమంతపైన సానుభూతి వస్తోంది. అందుకే తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ముంబైలో ఉంటూ బాలీవుడ్ లో నటించాలన్న నిర్ణయాన్ని సమంత తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సమంత ప్రస్తుతం ఎక్కువగా ముంబై లో ఉంటోంది. అంతేకాకుండా తెలుగు సినిమాలలో కూడా కనిపించడానికి ఇష్టపడలేదని సమాచారం.
త్వరలో సమంత రెండవ పెళ్లి
అయితే ఈ విషయమై సమంత అభిమానులు కాస్త నిరాశపడినప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా తమ హీరోయిన్ ఆరోగ్యంగా ఉంటె చాలని కోరుకుంటున్నారు. అంతేకా కుండా సమంత త్వరలో రెండవ పెళ్లి చేసుకోబోతోంది అంటూ రూమర్స్ వచ్చిన ఉన్నాయి. ఈ విషయం పైన కూడా ఆమె స్పందించలేదు. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ఈ వార్త నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంది.