Top 10 Heroines: తగ్గని సమంత క్రేజ్.. ఓర్మాక్స్ లిస్ట్‌లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు.. తర్వాత స్థానం ఎవరిదంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మార్చి 2026కి సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది. ఈసారి కూడా దక్షిణాది నటీమణులు బాలీవుడ్ హీరోయిన్లపై ఆధిపత్యం కొనసాగించాయి. ఈ జాబితాలో ఎప్పటిలాగే సమంత రూత్ ప్రభు నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో సమంత క్రేజ్ ఇంకా తగ్గలేదని స్పష్టమైంది. రెండో స్థానంలో బాలీవుడ్ స్టార్ అలియా భట్ నిలిచింది. మూడో స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలిచి సాయి పల్లవి, నయనతారలను వెనక్కి నెట్టింది. ఇటీవల వ్యక్తిగత విషయాలతో రష్మిక ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. నాలుగో స్థానాన్ని బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె దక్కించుకుంది.
వివరాలు
చివరి స్థానంలో శ్రీలీల
పలు పెద్ద ప్రాజెక్టులతో ఆమె క్రేజ్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఐదో స్థానంలో దక్షిణాది నటి కాజల్ అగర్వాల్ నిలిచింది. ఇటీవల పెద్దగా సినిమాలు లేకపోయినా ఈ స్థానం సంపాదించడం గమనార్హం. ఆరో స్థానంలో సాయి పల్లవి నిలిచింది. ఆమె త్వరలో రణబీర్ కపూర్‌తో కలిసి 'రామయణ' సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది.ఏడో స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, ఎనిమిదో స్థానంలో త్రిష కృష్ణన్ నిలిచింది. ఇటీవల విజయ్ సంబంధం ఉన్న రూమర్స్‌తో ఆమె ట్రెండింగ్‌లో నిలిచింది. తొమ్మిదో స్థానంలో బాలీవుడ్ నటి కృతి సనన్ ఉంది. 'అదిపురుష్'తో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. చివరిగా పదో స్థానంలో శ్రీలీల నిలిచింది.