Samantha : ఆ మూడు సంఘటనలు ఒక్కసారిగా ఇబ్బందిపెట్టాయి.. ఎలా బయటపడ్డానో తెలుసా
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటి సమంత స్టార్ కథనాయికగా పేరు తెచ్చుకున్నారు.ఒకదశలో తాను ఎదుర్కొన్న బాధల గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తనని ఒకేసారి మూడు రకాల సమస్యలు చుట్టుముట్టాయని చెప్పుకొచ్చారు.స్టార్ హీరోయిన్ గా పేరు గాంచిన సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించారు. ఈ క్రమంలోనే పూర్తి సమయాన్ని ఆరోగ్య సంరక్షణకు కేటాయించారు.తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు అన్నీ వరుసగా రావడంతో కుంగిపోయినట్లు పేర్కొన్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు వైవాహిక బంధం ముగింపు లాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే సమయంలో తాను నటించిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదని వాపోయారు. ఈ నేపథ్యంలోనే వేదన అనుభవించినట్లు చెప్పారు.గత రెండేళ్లుగా తీవ్ర కుంగుబాటుకు గురయ్యానన్నారు.
ఆ సమయంలో అలాంటి వారి గురించి తెలుసుకున్నా : సమంత
ఆ సమయంలో పెద్ద పెద్ద నటీనటుల గురించి చదివానని, వారు తమ ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకున్నానన్నారు. ఇదే సందర్బంలో ట్రోలింగ్‌లను సైతం ఎలా జయించారో తెలుసుకున్నానన్నారు. అయితే దృఢమైన వ్యక్తిత్వం ఉన్న వారి గురించి చదవడం తనకెంతో సహాయపడిందన్నారు.దీంతో తాను కూడా ఎదుర్కోగలనన్న ధైర్యం వచ్చిందన్నారు. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అందమైన బహుమతని,అందుకే తన బాధ్యతను నిర్వర్తించడంలో నిజాయితీగా ఉంటానన్నారు. ఆర్టిస్ట్ జీవితాలంటే సినిమాలు, అవార్డులు, దుస్తులు మాత్రమే కాదన్న సమంత, వాళ్ల జీవితాల్లోనూ కష్టాలుంటాయన్నారు. తన లాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారని, అందరికీ తనలాగే పోరాట శక్తి అందాలని ఆకాంక్షించారు.