
Ram Charan: రామ్ చరణ్‌తో సందీప్ వంగా మూవీ..? ఇండస్ట్రీలో హాట్ టాక్!
ఈ వార్తాకథనం ఏంటి
కేవలం రెండు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.
అతని దర్శకత్వ ప్రతిభకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అభిమానులు ఫిదా అయిపోయారు.
స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడగట్టుకున్న వంగా, ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న 'స్పిరిట్' మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తాడా అని ప్రభాస్ అభిమానులు అత్యుత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ వేసవిలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఏ నిమిషానికైనా ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
సందీప్ రెడ్డి 'యానిమల్ పార్క్', 'అల్లు అర్జున్ 24', 'స్పిరిట్' చేస్తున్నాడు.
అల్లు అర్జున్ సినిమా త్వరలో ప్రారంభం అయ్యే ఛాన్స్ తక్కువగానే ఉందని చెప్పొచ్చు.
రణ్‌బీర్కపూర్ ఇప్పటికే 'రామాయణం' రెండు భాగాలు, 'లవ్ అండ్ వార్', 'ధూమ్ 4' లాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దాంతో అతని డేట్స్ కూడా త్వరలో దొరకేలా లేవు.
ఈ గ్యాప్‌లో రామ్ చరణ్‌తో ఓ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
దీనికి సంబంధించి ఒక రౌండ్ చర్చలు కూడా జరిగాయని సమాచారం.
అయితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు ఇంకా కొంత సమయం పడవచ్చని టాక్. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' మూవీ పనుల్లో ఉన్నాడు.