Ranveer Allahbadia: యూట్యూబర్ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
'ఇండియాస్ గాట్ లాటెంట్' వేదికపై యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
ఈ వివాదంలో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరట లభించింది.
పాడ్‌కాస్ట్‌ను రద్దు చేయాలనే ప్రాసిక్యూషన్ వాదనను తిరస్కరించిన న్యాయస్థానం (Supreme Court), దాన్ని తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే, ఈ కేసులో అల్హాబాదియాకు న్యాయస్థానం మరోసారి గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది.
భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయని, అసభ్య పదజాలం వినియోగం హాస్యస్పదం కాదని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అతనికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణను పొడిగించిన ధర్మాసనం, గువహాటిలో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి సూచనలు
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నైతికత మరియు భావప్రకటనా స్వేచ్ఛ మధ్య సమతుల్యత అవసరమని స్పష్టం చేసింది.
డిజిటల్ కంటెంట్‌కు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే సమయంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది.