
Shalini Pandey: షాలిని పాండే షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ కథానాయిక షాలిని పాండే (Shalini Pandey) 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో షాలినికి ఒక్కసారిగా భారీ క్రేజ్ వచ్చింది.
ఒక్క సినిమాతోనే ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే, స్టార్ హీరోయిన్‌గా స్థిరపడలేకపోయింది. క్రమంగా ఆమెకు తెలుగు సినిమాల నుంచి ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది.
ప్రస్తుతం అక్కడ ఆమె కొన్నికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
వివరాలు
'డబ్బా కార్టెల్' లో షాలిని
ఇటీవల, షాలిని 'డబ్బా కార్టెల్' అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా, గత కొన్ని రోజులుగా ఆమెను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)తో పోలుస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంపై తాజాగా షాలిని స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
వివరాలు
మరో ఆలియా అవసరం లేదు
''ప్రేక్షకులు నన్నెంతో ప్రేమగా ఆదరిస్తున్నారు.వారి ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. అయితే, కొందరు నన్ను ఆలియా భట్‌తో పోలుస్తూ తమ అభిమానం చూపిస్తున్నారు. కానీ,మన ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక ఆలియా భట్ ఉన్నారు. కాబట్టి, మరో ఆలియా అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఆలియా అద్భుతమైన నటి, అందంగా కూడా ఉంటుంది. ఆమె సినీ ప్రపంచంలోనే కాదు, నిజ జీవితంలోనూ గొప్ప వ్యక్తి. నేను ఆమె నుంచి ఎంతో స్పూర్తి పొందుతాను, ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటాను. కానీ, నన్ను ఆమెతో పోల్చడం మాత్రం నాకు ఇష్టంలేదు. ప్రేక్షకులు నన్ను నా ప్రత్యేకతతో గుర్తిస్తే నాకు మరింత ఆనందం. నాకు నా స్వంత గుర్తింపు కావాలనేదే నా ఆశ'' అని షాలిని చెప్పింది.
వివరాలు
ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు అభిమానులు షాక్ అయ్యారు.