Saif Ali Khan: 'నా ప్రవర్తనపై సిగ్గుగా ఉంది'.. సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో ఆమె సైఫ్‌కు క్షమాపణలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న తన మెసేజ్‌లో సైఫ్ అలీ ఖాన్‌పై తనకు గౌరవం ఉందని, గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు ఆమె చింతిస్తున్నట్లు తెలిపారు.
సైఫ్ సర్, ఈ మెసేజ్ మీకు చేరుతుందని ఆశిస్తున్నానని, మీ గురించి మాట్లాడినప్పుడు తాను చూపిన అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.
ఆ సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత తనకు తెలియదన్నారు. సైఫ్ ధైర్యం నిజంగా ప్రశంసనీయమని, మీపై గౌరవం మరింత పెరిగిందని ఊర్వశీ రాసుకొచ్చారు.
Details
విమర్శల తర్వాత తప్పును అంగీకరించిన ఊర్వశీ
ఊర్వశీ డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో తనకు చాలా మంది బహుమతులు పంపించారని, తల్లి వజ్రపు ఉంగరం, తండ్రి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.
అయితే, వాటిని దాడి సంఘటనతో ముడిపెట్టడం విమర్శలకు దారి తీసింది.
'సైఫ్‌పై దాడి దురదృష్టకరమని, కానీ ఇప్పుడు తగిన భద్రత లేకుండా బహుమతులను బయట ధరించడమే పెద్ద రిస్క్‌గా అనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాయి. విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఊర్వశీ తన తప్పును అంగీకరించి క్షమాపణలు కోరారు.
ఇక డాకు మహారాజ్ సూపర్ హిట్ అవడంతో ఇప్పటివరకు రూ.150 కోట్ల వసూళ్లు సాధించిందని ఊర్వశీ పేర్కొన్నారు.