Page Loader
Sharwanand : శర్వానంద్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్
శర్వానంద్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్

Sharwanand : శర్వానంద్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2024
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తూ హీరోగా బిజీగా ఉన్న శర్వానంద్ తాజాగా మరో సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ కొత్త మూవీ రాబోతుంది. గురువారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ నేపథ్యంతో... సినిమా 1960 కాలంలో ఆపరేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. నార్త్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యం ఆధారంగా సంపత్ నంది ఈ కథను రూపొందించారు. భయంతో నిండిన ప్రాంతంలో అనేక ప్రశ్నలకు యువకుడు సృష్టించిన రక్తపాతం ఎలా సమాధానాలను అందించిందనే థీమ్‌తో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిపారు.

వివరాలు 

శర్వానంద్‌ మేకోవర్‌... 

ఈ సినిమాలో శర్వానంద్ 1960ల కాలం నాటి యువకుడిగా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం శర్వానంద్ పూర్తి మేకోవర్ అవుతున్నట్లు తెలిసింది. అతడి లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ గత సినిమాలకు భిన్నంగా ఉండబోతున్నాయి. గురువారం విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. 38వ మూవీ... శర్వానంద్ హీరోగా నటిస్తున్న 38వ చిత్రం ఇదే. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంలో కెకెరాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో రూపొందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

వివరాలు 

వెబ్ సిరీస్ దర్శకుడితో... 

ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ కంకర్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ మూవీని అంగీకరించారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రపు షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడిగా మాళవికా నాయర్ నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ అబ్బరాజు... సామజవరగమనాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో శర్వానంద్ ఓ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంలో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వివరాలు 

దర్శకుడు‌గా, రచయిత‌గా... 

దర్శకుడిగా "ఏమైంది ఈ వేళ" మూవీతో టాలీవుడ్‌లోకి పరిచయమైన సంపత్ నంది, రామ్ చరణ్‌తో "రచ్చ", రవితేజతో "బెంగాల్ టైగర్" చిత్రాలను తెరకెక్కించారు. గోపీచంద్‌తో "సీటీమార్", "గౌతమ్ నందా" సినిమాలను రూపొందించారు. దర్శకుడిగా కాకుండా "ఓదెల రైల్వే స్టేషన్", "పేపర్" వంటి చిన్న సినిమాలకు రచయితగా కూడా పనిచేశారు. ప్రస్తుతం, తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న "ఓదెల 2" చిత్రానికి సంపత్ నంది కథ అందించారు. శర్వానంద్ మూవీకి ముందు సాయిధరమ్ తేజ్‌తో సంపత్ నంది ఓ సినిమా చేయాల్సింది. కానీ, అనౌన్స్‌మెంట్ తర్వాత బడ్జెట్ సమస్యల వల్ల ఈ మూవీ ఆగిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్