శివ కార్తికేయన్ మహావీరుడు సినిమాపై బయటకు వచ్చేసిన టాక్: సినిమా ఎలా ఉందంటే?
శివ కార్తికేయన్ హీరోగా, దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా రూపొందిన మహావీరుడు చిత్రం, ఈరోజు థియేటర్లలో రిలీజైంది. మడోన్నె అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాక్ బయటకు వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ: కార్టూన్లు గీసే శివ కార్తికేయన్ బాగా భయస్తుడు. ప్రతీ దానికీ భయపడే శివ కార్తికేయన్ పాత్రకు ఎలక్షన్ కాంట్రాక్ట్ వస్తుంది. జనాలను ఆకర్షించడానికి కార్టూన్లు కావాలని ఒక పార్టీ అడుగుతుంది. ఈ క్రమంలో అతన్ని ఎవరో ఆవహిస్తారు. పైకి చూసినప్పుడల్లా అతన్ని వేరే ఎవరో ఆవహిస్తుంటారు. దాంతో అతడు పవర్ ఫుల్ పర్సన్ గా మారిపోతారు. ఇంతకీ అతన్ని ఆవహించింది ఎవరు? వాళ్ళు ఏం చేసారన్నదే కథ.
సెకండాఫ్ లో ఇబ్బంది పెట్టే సాగదీత
మహావీరుడు సినిమాలో కొన్ని సీన్లు రాగానే ఇది ఫక్తు కమర్షియల్ సినిమా అని తెలిసిపోతుంది. శివకార్తికేయన్ పాత్రను ఎవరో ఆవహించడమనే కొత్త పాయింటుతో సినిమాను ఆసక్తిగా మార్చారు. ఫస్టాఫ్ హ్యాపీగా నవ్వుకుంటూ గడిచిపోతుంది. సెకండాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే మొదలవుతుంది. కాకపోతే సెకండాఫ్ లో వచ్చే కొన్ని పొలిటికల్ సీన్లు చిరాకు తెప్పిస్తాయి. అలాగే కొన్నిచోట్ల సీన్లను బాగా సాగదీసారు. పర్ఫార్మెన్స్ పరంగా శివ కార్తికేయన్ ఇరగదీసారు. అదితి శంకర్ ఫర్వాలేదనిపించింది. సునీల్ క్యారెక్టర్ కు పెద్దగా ప్రాముఖ్యం ఉండదు. మొత్తానికి సెకండాఫ్ లో కొంత సాగదీత భరిస్తే సినిమాను బాగా ఎంజాయ్ చేసేయొచ్చు.