LOADING...
Shrasti Verma: బిగ్ బాస్ 9లో ఎంట్రీ ఇస్తున్నజానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ .. 
బిగ్ బాస్ 9లో ఎంట్రీ ఇస్తున్నజానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ ..

Shrasti Verma: బిగ్ బాస్ 9లో ఎంట్రీ ఇస్తున్నజానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ .. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి,అతనిపై కేసు దాఖలు చేసిన శ్రష్ఠి వర్మ మరోసారి వార్తల్లో నిలిచింది. డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా ప్రాచుర్యం పొందిన శ్రష్ఠి,గతంలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా పలు సంవత్సరాలు పని చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత,ఆమె జానీ మాస్టర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసి పోలీస్ కేసు నమోదు చేయడం ద్వారా సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసు నేపథ్యంలో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే,జానీ మాస్టర్ భార్య,అభిమానులు ఈ ఆరోపణలను ఖండించారు. కానీ శ్రష్ఠి తన వాదనలపై నిలబడి, పలు ఇంటర్వ్యూల్లో తన ఆరోపణలను మరింత విపులంగా వివరించింది.

వివరాలు 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో శ్రష్ఠి వర్మ

ఈ వివాదం సోషల్ మీడియా లో వైరల్ కావడంతో శ్రష్ఠి పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు శ్రష్ఠి వర్మ గురించి మరో హాట్ వార్త సోషల్ మీడియా‌లో చర్చనీయాంశం అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో శ్రష్ఠి వర్మ పాల్గొనబోతుందన్న వార్తలు బయటకొచ్చాయి. ఇప్పటికే కొందరు ప్రముఖులు ఈ రియాలిటీ షోలో ఫైనల్‌గా ఎంపిక అయినట్లు సమాచారం. శ్రష్ఠి వర్మ కూడా ఆ ఫైనల్ లిస్టులో ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినట్లయితే, గత అనుభవాలు,వివాదాలను ఆధారంగా చేసుకుని, షోకి భారీ ఎమోషనల్ డ్రామా, టీఆర్పీ రేటింగ్స్ అందించగలదని మేకర్స్ భావిస్తున్నారు.

వివరాలు 

బిగ్ బాస్ హౌస్‌లో సాధారణ వ్యక్తులకు అవకాశం 

ఈ వార్తలపై ఇప్పటివరకు శ్రష్ఠి స్పందించలేదు. అయితే, ఆమె షోలోకి చేరిన తరువాత, కొత్త సంచలనాలు, ఎమోషనల్ మోమెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బజ్ కారణంగా బిగ్ బాస్ 9పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లో సాధారణ వ్యక్తులు కూడా అవకాశం పొందనున్నారు. లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినప్పటికీ, నిర్వాహకులు కఠినమైన సెలెక్షన్ ప్రక్రియ ద్వారా 45 మంది ప్రతిభావంతులను ఫైనల్ చేశారు. ఈ 45 మంది నుంచి టాప్ 15 ని ఎంపిక చేసేందుకు రియాలిటీ షో నిర్వాహకులు ప్రత్యేకమైన టాస్క్‌లను నిర్వహిస్తున్నారు. ఈ షోకి హోస్ట్‌గా ఎనర్జిటిక్ శ్రీముఖి వ్యవహరిస్తుండగా, జ్యూరీగా నవదీప్, బిందుమాధవి, అభిజిత్ వంటి స్టార్‌లను నియమించారు.