Page Loader
రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లో అడుగుపెడుతున్నాడా?.. ఇదిగో క్లారిటీ 
రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లో అడుగుపెడుతున్నాడా?.. ఇదిగో క్లారిటీ

రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లో అడుగుపెడుతున్నాడా?.. ఇదిగో క్లారిటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2023
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

యూట్యూబ్ లో లోకల్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్,ఆపై టాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా సుమారు 50కిపైగా చిత్రాల్లో పాడడమే కాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌-3లోను విజేతగానూ నిలిచాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌ ను ఆస్కార్‌ వేదికపైనా పాడి అలరించే అవకాశం దక్కించుకున్నాడు. రాహుల్‌.. కాంగ్రెస్ తరుపు నుండి గోషామహాల్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై రాహుల్ స్పందిస్తూ.. తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు,గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలని ఖండిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతానికి కెరీర్ పైనే ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చాడు.రూమర్స్ కు ఇకనైనా చెక్ చెప్పాలని అన్నాడు.ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్