LOADING...
సలార్ పాత డేట్ లో విడుదలకు స్కంద సన్నాహలు.. త్వరలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్
త్వరలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్

సలార్ పాత డేట్ లో విడుదలకు స్కంద సన్నాహలు.. త్వరలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినాయక చవితి వారంపై టాలీవుడ్ ప్రధాన సినిమాలు కన్నెశాయి. ఈ జాబితాలో ప్రథమంగా నిలుస్తోంది స్కంద సినిమా. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రామ్‌ పోతినేనికి జోడిగా శ్రీలీల నటించింది. ఇప్పటికే ఈ సినిమాపై మాస్‌ ప్రేక్షకుల్లో హై రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బీ,సీ సెంటర్ల ప్రేక్షకులను స్కంద ఉర్రూతలూగించనుంది. సెప్టెంబర్‌ 28న స్కంద విడుదల అయ్యేందుకు సన్నద్ధం అవుతోంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం సలార్‌ సెప్టెంబర్‌ చివరి వారంలో రిలీజవ్వాలి. అది కాస్త వాయిదా పడనున్నట్లు సమాచారం. అదే డేట్‌లో స్కంద విడుదల కానుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. థమన్‌ సంగీతంలో రిలీజైన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెప్టెంబర్ 28న స్కంద రిలీజ్