Page Loader
Nagavamsi : సౌత్‌ వర్సెస్ బాలీవుడ్.. బోనీ కపూర్‌పై నాగవంశీ సెటైరిక్‌ పంచ్‌
సౌత్‌ వర్సెస్ బాలీవుడ్.. బోనీ కపూర్‌పై నాగవంశీ సెటైరిక్‌ పంచ్‌

Nagavamsi : సౌత్‌ వర్సెస్ బాలీవుడ్.. బోనీ కపూర్‌పై నాగవంశీ సెటైరిక్‌ పంచ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్‌ ఇండియన్‌ చిత్రాలు బాలీవుడ్‌కు ఎలా మార్గదర్శకంగా మారాయో చెబుతూ, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ప్రత్యేక శైలిలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. గుంటూరు కారం, దేవర సినిమాల ప్రచార సమయాల్లో నాగవంశీ స్పీచ్‌లు ఆకట్టుకున్నాయి. తాజాగా జరిగిన ఓ బాలీవుడ్‌ మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్‌ టేబుల్ సమావేశంలో ఆయన చేసిన సెటైరిక్‌ వ్యాఖ్యలు హైలైట్‌గా నిలిచాయి. ఈ రౌండ్ టేబుల్‌ చర్చకు సౌత్‌, నార్త్‌కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటులు హాజరయ్యారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో మాట్లాడుతున్న నాగవంశీ ఇది కొంచెం హార్ష్‌గానే ఉన్నా మీరు ఒప్పుకోవాల్సిన నిజం. మా సౌత్‌ వాళ్ళు బాలీవుడ్‌కు సినిమాలు ఎలా తీయాలో నేర్పుతున్నారని చెప్పారు.

Details

జవాన్‌ కూడా సౌత్‌ వాడే తీసాడు

మీరు ఇంకా బాంద్రా, జుహూ దగ్గరే ఆగిపోయారు, మేము బాహుబలి, ఆర్ఆర్ఆర్‌, పుష్ప, సలార్‌, యానిమల్‌ వంటి సినిమాలు తీస్తున్నామని వ్యాఖ్యానించారు. దీనికి బోనీ కపూర్‌ 'అవి మేము ఎప్పుడో చేసాం' అని సమాధానమిస్తే, నాగవంశీ తనదైన శైలిలో 'బాహుబలి, ఆర్ఆర్ఆర్‌, పుష్ప, సలార్‌, యానిమల్‌ ఇవన్నీ సౌత్‌ నుంచి వచ్చి హిందీ భాషలో భారీ కలెక్షన్లు సాధించాయి కదా అని కౌంటర్‌ ఇచ్చారు. బోని, గదర్ 2, పఠాన్‌, జవాన్‌ను మర్చిపోయావ్" అని గుర్తుచేయగా, నాగవంశీ మరోసారి సమర్థవంతమైన సమాధానంతో, 'జవాన్‌ కూడా సౌత్‌ వాడే తీశాడు' అంటూ వ్యాఖ్యానించారు.