Loading...
Sreeleela: ముంబైలో శ్రీలీల సందడి.. మళ్లీ పట్టాలెక్కిన కార్తీక్ ఆర్యన్ మూవీ షూటింగ్!
ముంబైలో శ్రీలీల సందడి.. మళ్లీ పట్టాలెక్కిన కార్తీక్ ఆర్యన్ మూవీ షూటింగ్!

Sreeleela: ముంబైలో శ్రీలీల సందడి.. మళ్లీ పట్టాలెక్కిన కార్తీక్ ఆర్యన్ మూవీ షూటింగ్!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 15, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు రూపొందిస్తున్న భారీ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీలీల కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటూ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

అవైటెడ్ మల్టీస్టారర్ రొమాంటిక్ మ్యూజికల్ థ్రిల్లర్‌..

ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూ వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్.. ఇప్పుడు తిరిగి సెట్స్‌పైకి రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ రొమాంటిక్ మ్యూజికల్ థ్రిల్లర్‌కు 'తు గై లవ్ కామ్' (Tu Gaye Love Kaam) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రాన్ని 2027 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే టైటిల్, రిలీజ్ డేట్ వంటి వివరాలపై అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వివరాలు

టి-సిరీస్ బ్యానర్‌పై సినిమా..

టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

తొలుత ఈ ప్రాజెక్ట్‌ను 'ఆషికీ 3' పేరుతో తెరకెక్కించాలని భావించారు. అయితే కొన్ని కాపీరైట్ సమస్యల కారణంగా ఆ ఆలోచనను పక్కనపెట్టి.. కొత్త కథతో సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.

ప్రీతమ్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఒక ప్రత్యేకమైన లవ్ డ్రామాగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ADVERTISEMENT