
Srilila: శ్రీలీల కోలీవుడ్ అరంగేట్రం.. త్వరలో తమిళ ప్రేక్షకుల ముందుకు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల అతి చిన్న వయస్సులో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో అగ్రకథనాయకులతో నటించి మెప్పింది.
పెళ్లి సందడి తర్వాత శ్రీలీల వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఆమెకు హిందీ, తమిళ సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే తమిళ తెరలో శ్రీలీల కనిపించనున్నట్లు తెలిసింది.
ఇక తమిళ హీరో శివకార్తికేయన్ 'రెమో', 'వరుణ్ డాక్టర్', 'డాన్', 'ప్రిన్స్' సినిమాలతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
Details
శివకార్తికేయన్ సరసన శ్రీలీల
శివకార్తికేయన్ తో కలిసి తమిళ ప్రాజెక్టులో శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది.
జాతీయ పురస్కార గ్రహిత 'ఆకాశం నీ హద్దురా' ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలో వీరిద్దరూ నటించినట్లు సమాచారం. ఈ సినిమాకు 'పురాణనూరు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఇటీవల హీరో హీరోయిన్లపై ఫోటో షూట్ కూడా చేశారట. దీనిపై త్వరలోనే మూవీ టీం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
మరోవైపు బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ మల్హోత్రాతో నటించే అవకాశం శ్రీలీలకు వచ్చిందట.
బల్విందర సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మిట్టి' సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలకు ఆఫర్ చేశారట.