LOADING...
Srinu Vaitla: బాలకృష్ణతో శ్రీను వైట్ల సినిమా … 'ఢీ' సీక్వెల్‌పై కీలక వివరణ ఇచ్చిన దర్శకుడు 
బాలకృష్ణతో శ్రీను వైట్ల సినిమా … 'ఢీ' సీక్వెల్‌పై కీలక వివరణ ఇచ్చిన దర్శకుడు

Srinu Vaitla: బాలకృష్ణతో శ్రీను వైట్ల సినిమా … 'ఢీ' సీక్వెల్‌పై కీలక వివరణ ఇచ్చిన దర్శకుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

యాక్షన్‌, కామెడీ చిత్రాలను ప్రత్యేకమైన శైలిలో రూపొందించడంలో దర్శకుడు శ్రీను వైట్లకు (Srinu Vaitla) ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు వంటి టాలీవుడ్‌ అగ్ర హీరోలతో సినిమాలు రూపొందించి ప్రేక్షకులకు పుష్కలమైన వినోదాన్ని అందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. బాలకృష్ణపై తనకెంతో అభిమానం ఉందని, గతంలో ఒకసారి ఆయనతో సినిమా చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని చెప్పారు. అయితే భవిష్యత్తులో తప్పకుండా బాలకృష్ణతో ఒక సినిమా తెరకెక్కిస్తానని స్పష్టంచేశారు. అలాగే, బాలకృష్ణ నటించిన 'ప్రాణానికి ప్రాణం' సినిమాతోనే తాను అప్రెంటీస్‌గా సినీ పరిశ్రమలో కెరీర్‌ను ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు.

వివరాలు 

''ఢీ' సినిమాలో శ్రీహరి పాత్ర కీలకం

'ఢీ' సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ..''ఢీ' చిత్రంలో శ్రీహరి పోషించిన పాత్ర ఎంతో కీలకం. కానీ, ఆయన లేరు కాబట్టి వేరొకరితో ఆ క్యారెక్టర్‌ను కొనసాగించలేం. అందుకే, అప్పట్లో సీక్వెల్‌ చేయాలనుకున్న ఆలోచనను మానుకోవాల్సి వచ్చింది'' అని వివరించారు. గతేడాది గోపీచంద్‌ హీరోగా నటించిన 'విశ్వం' సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్‌ కోసం కథ రాస్తున్నట్టు తెలిపారు.