
SSMB 29: రాజమౌళి-మహేష్ యాక్షన్-అడ్వెంచర్ సినిమాకు టైటిల్ ఇదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్-అడ్వెంచర్ సినిమా టైటిల్ ఖరారైనట్లు సమాచారం. ఇప్పటివరకు 'SSMB29'గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు 'జెన్ 63'(Gen 63) అనే పేరు పెట్టినట్టు పీపింగ్ మూన్ రిపోర్ట్ చేసింది. మహేష్ బాబు పోషిస్తున్న పాత్ర 63వ తరం గొప్ప వంశానికి చెందినది. అరుదైన వస్తువుల కోసం మిథికల్ క్వెస్ట్ చేపట్టే కథతో ఈ టైటిల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి శనివారం చేసిన ట్వీట్ ప్రకారం, ఈ చిత్రానికి 'గ్లోబ్ ట్రాటర్' అనే ప్రత్యామ్నాయ టైటిల్ ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
సినిమా వివరాలు
'రామాయణం'లో మూలాలు - ప్రాచీన కాశీ నేపథ్యం
రిపోర్ట్ ప్రకారం, 'జెన్ 63'(Gen 63) కథ భారతీయ పురాణగాధలతో పాటు సైన్స్ ఫిక్షన్ కలయికలో రూపొందుతోంది. రామాయణం ప్రేరణగా తీసుకొని, ప్రాచీన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కాశీ నగరంలో ఈ కథ నడుస్తుంది. భారతీయ చరిత్ర వైభవాన్ని ప్రతిబింబించే అద్భుతమైన విజువల్స్‌తో పాటు, భవిష్యత్తు తరం కథనాన్ని మిళితం చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది.
ప్రొడక్షన్ వివరాలు
ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ కీలక పాత్రల్లో
మహేశ్‌తో పాటు ఈ సినిమాలో అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా జోనాస్ ఒక ధైర్యవంతమైన అన్వేషకురాలిగా, పృథ్విరాజ్ సుకుమారన్ హైటెక్ విలన్‌గా నటించనున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫ్రెంట్ లుక్స్‌లో అలరించనున్నారు. భారతదేశంలోని వివిధ చిత్ర పరిశ్రమల నుంచి పలువురు నటులను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. ఆగస్టు 15 నుంచి టాంజానియాలో నెలరోజులపాటు భారీ యాక్షన్ సీన్లు, అడవి సన్నివేశాల కోసం షూటింగ్ జరపనున్నారని చెబుతున్నారు.
విడుదల ప్రణాళికలు
2027 వేసవిలో విడుదల
మొదట కెన్యాలో షూట్ ప్లాన్ చేసినా, అక్కడి అంతర్గత ఉద్రిక్తతల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. చివరికి, ప్రాచీన వైభవం, భిన్నమైన అందాలతో ఉన్న టాంజానియా లొకేషన్లు రాజమౌళి కల్పనకు సరిపోతాయని భావించి అక్కడే చిత్రీకరణకు నిర్ణయించారు. 2026 మధ్య నాటికి షూటింగ్ పూర్తిచేసి, 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.