LOADING...
SSMB 29: 120 దేశాల్లో 'SSMB 29'..కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి బృందం
120 దేశాల్లో 'SSMB 29'..కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి బృందం

SSMB 29: 120 దేశాల్లో 'SSMB 29'..కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి బృందం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అదే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్. ప్రస్తుతం కెన్యాలో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా, ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిను చిత్రబృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆ భేటీ తర్వాత ముఖ్యాంశాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వివరాలు 

సినిమా 120 దేశాల్లో విడుదల

''రెండు దశాబ్దాలుగా రాజమౌళి సినీ పరిశ్రమలో కొనసాగుతూ,బలమైన కథనాలతో పాటు శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తూ,భారతీయ సంస్కృతిలోని లోతును ప్రపంచానికి చూపిస్తున్నారు.తూర్పు ఆఫ్రికా పర్యటన అనంతరం ఆయన బృందం 120 మందితో కలిసి కెన్యాను ప్రధాన చిత్రీకరణ స్థలంగా ఎంచుకుంది. మసాయి మరా మైదానాలు,అందమైన నైవాషా,చారిత్రక అంబోసెలి వంటి ప్రదేశాలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను 120 దేశాల్లో విడుదల చేయాలన్న ఆలోచనతో టీమ్ ముందుకు సాగుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. కెన్యాలో షూటింగ్ జరగడం ఒక మైలురాయిగా నిలవనుంది.

వివరాలు 

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ చూడని సరికొత్త ప్రపంచం: విజయేంద్రప్రసాద్

మా దేశపు సహజసిద్ధమైన అందాలు, ఆతిథ్యం, ప్రత్యేక దృశ్యాలను ఈ సినిమా అంతర్జాతీయ వేదికపై ప్రతిభావంతంగా ప్రతిబింబిస్తుంది. ఎస్‌ఎస్‌ఎంబీ 29 ద్వారా కెన్యా తన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమైంది అన్న గర్వం కలుగుతోంది'' అని తెలిపారు. ఇక, అమెజాన్ అడవుల నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు ప్రపంచంలోని పలు విదేశీ భాషల్లోనూ సినిమాను అనువదించే పనులు జరగనున్నాయి. దీనిపై రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఇప్పటివరకూ భారతీయ చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నారు'' అని తెలిపారు. ఈ ప్రకటనతో ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముసాలియా ముదావాది చేసిన ట్వీట్