Page Loader
Sukumar- NTR: సుకుమార్‌తో ఎన్టీఆర్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌.. క్యాప్షన్‌తో ఆకట్టుకున్న హీరో
సుకుమార్‌తో ఎన్టీఆర్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌.. క్యాప్షన్‌తో ఆకట్టుకున్న హీరో

Sukumar- NTR: సుకుమార్‌తో ఎన్టీఆర్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌.. క్యాప్షన్‌తో ఆకట్టుకున్న హీరో

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ టాప్‌ హీరో ఎన్టీఆర్‌, క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌తో కూడిన ఓ హృద్యమైన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను సుకుమార్‌ భార్య తబిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా, "తారక్‌కి ప్రేమతో" అనే సందేశాన్ని జోడిస్తూ, ఎన్టీఆర్‌కు ట్యాగ్‌ చేశారు. ఈ ఫొటోపై స్పందించిన ఎన్టీఆర్‌ తన ఇన్‌స్టా స్టోరిలో ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసి, "నన్ను ఎప్పుడూ వెంటాడే ఓ భావోద్వేగం" అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. అంతేకాకుండా, దర్శకుడు సుకుమార్‌ను ట్యాగ్‌ చేశారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన "నాన్నకు ప్రేమతో" సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఫొటోకు అదే చిత్రంలోని ఓ సంభాషణను క్యాప్షన్‌గా పెట్టడం అందరినీ ఆకర్షిస్తోంది.

వివరాలు 

బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్న ఎన్టీఆర్‌ 

ఇదిలా ఉండగా,ఎన్టీఆర్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల "దేవర" చిత్రంతో విజయాన్ని అందుకున్న తారక్‌ ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. "వార్‌ 2" ద్వారా హిందీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం హృతిక్‌ రోషన్‌తో కలిసి తెరకెక్కుతోంది. షూటింగ్‌ తుది దశకు చేరగా,ఒక పాట మాత్రమే మిగిలి ఉంది.ఇక మరోవైపు,ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం, ఇప్పటి వరకు భారతీయ చిత్రసీమలో కనీవినీ ఎరుగని కథాంశంతో రూపొందుతోంది. దీనిపై స్పందించిన నిర్మాత, ఇది ఊహించినంతకన్నా ఎక్కువ వసూళ్లను రాబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలియజేశారు.