
Rajinikanth: రజినీకాంత్ సినిమా 'వేట్టయాన్' రిలీజ్ .. హాలిడే ప్రకటించిన ప్రముఖ కంపెనీలు
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వేట్టయాన్'. సూర్యతో 'జై భీమ్' చిత్రం తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియా భాషలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, లిరికల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
రజనీకాంత్ సినిమాలు విడుదల అంటే తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంటుంది.
వివరాలు
వేట్టయాన్' మద్రాసులో 656 షోస్
విడుదలకు ముందు రోజు నుండే కటౌట్లు,పాలాభిషేకాలు,ఫ్యాన్స్ సందడితో చేసే రచ్చ అసాధారణంగా ఉంటుంది.
అదే విధంగా,రజనీ సినిమా విడుదల అంటే తమిళనాడులో ఆఫీసులకు హాలిడే ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది.
గతంలో సూపర్ స్టార్ నటించిన 'రోబో', 'శివాజీ', 'కబాలి'విడుదల సమయంలో చెన్నైలోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు హాలిడే ప్రకటించాయి.
ఆ సమయంలో తమిళనాడులో రజనీ మ్యానియా ఉండేది.ఇక, తలైవా నటించిన తాజా సినిమా 'వేట్టయాన్' మద్రాసులో 656 షోస్ (All Time Record) విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేశాయి.
ఈ నేపథ్యంలో,తమిళనాడు వ్యాప్తంగా కొన్ని కంపెనీలు హాలిడే ప్రకటిస్తూ లెటర్ విడుదల చేశాయి.
రజనీ స్టామినా అప్పటికీ,ఇప్పటికీ,ఎప్పటికీ తగ్గదని తలైవర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న ప్రముఖ కంపెనీల హాలిడే లెటర్స్
#வேட்டையனுக்கு கம்பெனி விடுமுறை#VettaiyanFrom10thOctober @rajinikanth pic.twitter.com/5fO9MeKQkj
— RBSI RAJINI FAN PAGE (@RBSIRAJINI) October 8, 2024