Jailer 2 : సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస పరాజయాల తర్వాత తన స్టామినాను నిలబెట్టిన సినిమా 'జైలర్'.
ఈ విజయం తర్వాత రజనీకాంత్ నటించిన చిత్రం 'వేట్టయన్ - ద హంటర్' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.
ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయగా, కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ప్రస్తుతం రజనీకాంత్ 'కూలీ' సినిమాతో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశకు చేరుకోవడంతో, వెంటనే 'జైలర్ 2' ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాను జైలర్ దర్శకుడు నెల్సన్ తెరకెక్కించనున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చిలో 'జైలర్ 2' షూటింగ్ ప్రారంభం కానుంది.
Details
యాక్షన్ సన్నివేశాలపై ప్రత్యేక సెట్
తొలి షెడ్యూల్‌లో రజనీకాంత్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సీక్వెల్‌లో రజనీకాంత్‌ను మరింత స్టైలిష్‌గా చూపించడానికి నెల్సన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.
'జైలర్ 2' చిత్రంలో తమన్నా, యోగి బాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ముందుగా 'జైలర్ 2' చిత్రీకరణ గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.