
Manchu Mohan Babu: మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు షాక్.. విచారణకు హజరు కావాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో విచారణ నుంచి తనను మినహాయించాలంటూ, స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్పష్టంగా తిరస్కరించింది
. విచారణ నుంచి తప్పించుకోవడానికి మోహన్‌బాబు కోరిన స్టేను మంజూరు చేయలేదు.
ఈ నేపథ్యంలో మే 2న జరిగే విచారణకు తప్పకుండా హాజరుకావాలని జస్టిస్ బేలా ఎం. త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Details
నాలుగు వారాలకు వరకు వాయిదా
అంతేకాక ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలన్న విన్నపాన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది.
వాదనలు వింటున్న సందర్భంగా, 'ధర్నా జరిగినప్పుడు మీరు వ్యక్తిగతంగా అక్కడే ఉన్నారు కదా? అంటూ మోహన్‌బాబు తరపు న్యాయవాదిని జస్టిస్ బేలా ప్రశ్నించారు.
అయితే తన వయసు 75 సంవత్సరాలు, తాను ఒక ప్రైవేట్ వ్యక్తినని.. తనపై ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తించదని మోహన్‌బాబు తరపు న్యాయవాది వాదించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నిర్వహించిన ధర్నా ఎలక్షన్ మోడల్ కోడ్ పరిధిలోకి రాదని, అయినా చార్జ్‌షీట్‌లో మోడల్ కోడ్ ఉల్లంఘన కేసు మోపారని వాదనలు వినిపించారు.
తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.