NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Rolex: రోలెక్స్‌ పాత్ర కోసం 20ఏళ్లుగా దానికి దూరంగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న సూర్య
    తదుపరి వార్తా కథనం
    Rolex: రోలెక్స్‌ పాత్ర కోసం 20ఏళ్లుగా దానికి దూరంగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న సూర్య
    రోలెక్స్‌ పాత్ర కోసం 20ఏళ్లుగా దానికి దూరంగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న సూర్య

    Rolex: రోలెక్స్‌ పాత్ర కోసం 20ఏళ్లుగా దానికి దూరంగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న సూర్య

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 29, 2024
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం విక్రమ్. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది.

    చిత్రంలో మొత్తం 20 నిమిషాల నిడివి ఉన్న కీలక ఘట్టాలు ప్రేక్షకులను అలరించాయి.

    డ్రగ్స్ మాఫియాను శాసించే రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించారు.ఈ పాత్ర సూర్యకి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.

    ఈ సినిమాలో సూర్య పాత్ర కనిపించింది కొద్దిసేపే అయినా, థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది.

    సూర్య తాజాగా తన కొత్త చిత్రం 'కంగువ' ప్రమోషన్లలో రోలెక్స్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

    20 సంవత్సరాలుగా ధూమపానానికి దూరంగా ఉన్న సూర్య, ఈ పాత్ర కోసం మళ్లీ సిగరెట్ త్రాగడం మొదలు పెట్టారు.

    వివరాలు 

    అందుకే సిగరెట్‌ కాల్చక తప్పలేదు: సూర్య 

    "ప్రతినాయక పాత్ర కావడంతో మరింత ఇంటెన్స్ గా ఉండాలనుకున్నానని,అందుకే సిగరెట్‌ కాల్చక తప్పలేదని చెప్పారు.

    సూర్య మాట్లాడుతూ,"సిద్ధమైన స్కెచెస్ ఆధారంగా మేకప్ ఆర్టిస్ట్ నన్నురెడీ చేశారు.నేను రిహార్సల్స్ కూడా చేయలేదు.షూటింగ్ రోజు ఉదయం నా డైలాగ్స్ పంపించారు"అని తెలిపారు.

    కమల్ హాసన్ పట్ల తన అభిమానం గురించి చెప్పిన సూర్య,"ఆయన ఎదుట నటించాలంటే కాస్త భయపడ్డాడని నాసన్నివేశాలు తీసే సమయంలో కమల్ హాసన్ సెట్ వస్తారని చెప్పారు.అందుకే నేను అయన వచ్చేలోపు నా సన్నివేశాలను పూర్తి చేయాలి'అని కోరుకున్నాను"అని తెలిపారు.

    రోలెక్స్ అనే ప్రత్యేక చిత్రం త్వరలో రానున్నదని,ఇది సూర్య నటించిన మరో చిత్రానికి కనెక్షన్ కలిగి ఉందని సమాచారం.

    ప్రస్తుతం,సూర్య నటిస్తున్న కంగువా చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూర్య

    తాజా

    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్

    సూర్య

    సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  సినిమా
    సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే?  సినిమా
    కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య  గ్లింప్స్
    Happy birthday Suriya: సూర్య నటించిన సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025