Independence Day : దేశ భక్తిని చాటి చెప్పే టాప్-5 టాలీవుడ్ సినిమాలపై ఓ లుక్కేయండి
యావత్ భారతదేశం దేశభక్తిని గుండెలో నింపుకొని జరుపుకొనే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం. తెల్లదొరల బానిస సంకెళ్ల నుండి భారతీయులకు విముక్తి కలిగిన రోజు. ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్య్ర వచ్చి 78 ఏళ్లు అవుతోంది. దేశ భక్తి చిత్రాలకు భారతీయ ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానముంది. అయితే ఈ 75 ఏళ్లలో దేశభక్తిని చాటి చెప్పే టాలీవుడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
అల్లూరి సీతారామరాజు
సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రం స్వాతంత్య్ర సమరయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో 175 రోజులు ఆడి కలెక్షన్ల వర్షం కురిపించింది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1922-24 మద్రాసు ప్రెసిడెన్సీ స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన కథాంశంగా తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.
మేజర్ చంద్రకాంత్
సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు నటించిన 'మేజర్ చంద్రకాంత్' 1993లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించాలనే లక్ష్యంతో ఉన్న సైనికుడి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పట్లోని ఈ సినిమా పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయాయి.
భారతీయుడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా, అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ హాసన్ నటన ఆకట్టుకుంది. స్వాతంత్య్రాని కి ముందు బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని ఈ చిత్రంలో అందగా డైరక్టర్ తెరకెక్కించారు.
ఖడ్గం
దేశభక్తి కథాంశంతో వచ్చిన ఖడ్గం సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించారు. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తీశారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. 2002లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో రికార్డులను క్రియేట్ చేసింది.
సైరా నరసింహారెడ్డి
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా 'సైరా నరసింహారెడ్డి' సినిమాను తీశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుధీప్ కీలక పాత్రలు పోషించారు. ఉయ్యాల నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్య్ర తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.