
Ilaiyaraaja: సంగీత పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మాస్ట్రో.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తరాలు మారినా ఇళయరాజా సంగీతంపై అభిమనం మాత్రం తగ్గలేదు. గత 50 ఏళ్లుగా కోట్లమందికి తన అమృతసమానమైన సంగీతంతో మంత్ర ముగ్ధులను చేసిన ఆయన ప్రస్థానం మరో ముఖ్యమైన మలుపు తీసుకుంది.
ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం ఇళయరాజా 50 ఏళ్ల సంగీత ప్రయాణంపై కీలక ప్రకటన చేసింది.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత ప్రస్థానాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టాలిన్ చేసిన ట్వీట్
இலண்டன் மாநகரில் #Symphony சாதனை படைத்துத் திரும்பியுள்ள இசைஞானி @ilaiyaraaja அவர்கள், அவரது பயணத்துக்கு வாழ்த்திய என்னை நேரில் சந்தித்து நன்றி கூறினார்.
— M.K.Stalin (@mkstalin) March 13, 2025
அவரது அரை நூற்றாண்டுகாலத் திரையிசைப் பயணத்தை அரசின் சார்பில் கொண்டாட முடிவெடுத்துள்ளோம்!
ராஜாவின் இசை ராஜ்ஜியத்தில் வாழும்… pic.twitter.com/e3Ofpt2Upq
వివరాలు
సంగీత ప్రపంచంలో రాజా
తెనీ జిల్లాలోని మారుమూల గ్రామంలో రాజయ్యగా జన్మించి, ఆ తర్వాత సంగీత ప్రపంచంలో రాజాగా వెలుగొందిన ఆయన పేరు 'ఇళయరాజా'గా మారింది.
అప్పటికే చిత్రసీమలో ఏ.ఎం. రాజా పేరున్నందున, తన పేరుకు 'ఇళయ' అనే పదాన్ని జోడించుకుని ఇళయరాజాగా పరిచయమయ్యారు.
1976లో విడుదలైన 'అన్నాకిళి' చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
అప్పటి నుంచి, 1,500కు పైగా చిత్రాలకు 8,500 పాటలను సమకూర్చి, 81 ఏళ్ల వయసులోనూ తన సంగీత కీర్తిని కొనసాగిస్తున్నారు.
వివరాలు
వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో సింఫనీ
భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు, ఆయన వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన 'సింఫనీ'ని రూపొందించారు.
'వేలియంట్' అనే పేరుతో నామకరణం చేసిన ఈ సింఫనీని మార్చి 8న లండన్‌లో, 85 మంది సభ్యులతో కూడిన ప్రఖ్యాత రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ సంగీత మహోత్సవానికి హాజరై, 45 నిమిషాల నిడివిగల నాలుగు అంచెల సింఫనీని ఆస్వాదించి, స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో సింఫనీ రూపొందించి, లండన్‌లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయుడిగా ఇళయరాజా చరిత్ర సృష్టించారు.