Raju Gaani Savaal : 'రాజు గాని సవాల్' టీజర్ విడుదల.. మీరు కూడా టీజర్ చూసేయండి..
ఈ వార్తాకథనం ఏంటి
లెలిజాల రవీందర్,రితికా చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం 'రాజు గాని సవాల్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో,ఎల్ ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లెలిజాల రవీందర్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ నటుడు జగపతిబాబు ఆవిష్కరించారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఈ సినిమాను ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. టీజర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నిర్మాత తరుణిక మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో మాస్ అంశాలతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి.'రాజు గాని సవాల్'విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకు ఉంది" అని అన్నారు.
వివరాలు
ఎంటర్టైన్మెంట్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కలిసిన చిత్రం
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. "హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించేలా, తెలంగాణలోని కుటుంబ సంబంధాలను, ఫ్యామిలీ బాండింగ్‌ను చూపించేలా మా చిత్రం రూపొందించాం. బ్రదర్-సిస్టర్ మధ్య ఉండే అనుబంధాన్ని, కుటుంబ సభ్యుల మధ్య ఉండే భావోద్వేగాలను, స్నేహితుల మధ్య సంబంధాలను చిత్రంలో చూపించాం. సహజతకు ప్రాధాన్యం ఇస్తూ, లోయర్ ట్యాంక్ బండ్‌లోని కవాడిగూడలో నిజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఈ చిత్రం ఒక క్లాసిక్ మూవీగా నిలుస్తుంది. ఎంటర్టైన్మెంట్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కలిసిన చిత్రం ఇది" అని వివరించారు.
వివరాలు
బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ డ్రామా
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. "జగపతిబాబు గారు ఎంత బిజీగా ఉన్నా, మాపై ఉన్న అభిమానంతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంతో రూపొందిన బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ డ్రామా. టికెట్ కొని మా సినిమాకి వచ్చే ప్రతి ఒక్కరినీ మేము నిరాశపరచం. లోకల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సెంటిమెంట్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపేస్తాయి" అని తెలిపారు.