తెలుగు సినిమా: హీరోను డామినేట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టులు పేరు తెచ్చుకున్న సినిమాలు
తెలుగు సినిమాల్లో సాధారణంగా హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్లకు కూడా అంతంత మాత్రమే ప్రాముఖ్యం ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయనుకోండి. అయితే ఒక సినిమాలో హీరో పాత్రను డామినేట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ పేరు తెచ్చుకున్న సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఆ సినిమాల లిస్టు చూద్దాం. ప్రతీరోజూ పండగే - రావు రమేష్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరో అయినా కూడా రావు రమేష్ పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులంతా ఈ పాత్రను చూసి నవ్వుతారు, కోపం తెచ్చుకుంటారు. కానీ ఈ పాత్రను మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. ఒకరకంగా ఈ సినిమాను నిలబెట్టింది ఈ పాత్రే అని చెప్పవచ్చు.
అల్లరి నరేష్ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ
మిడిల్ క్లాస్ మెలోడీస్ - గోపరాజు రమణ మిడిల్ క్లాస్ జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించారు. హీరో ఆనంద్ దేవరకొండకు తండ్రిగా నటించిన గోపరాజు రమణ, ఈ సినిమాను మరో హీరో అని చెప్పవచ్చు. మొదటి నుండి చివరి వరకూ ప్రేక్షకుల పెదాల మీద నవ్వు కదలాడుతుందంటే దానికి కారణం గోపరాజు నటనే. నాంది - వరలక్ష్మీ శరత్ కుమార్ అల్లరి నరేష్ ని కొత్తగా చూపించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. హీరో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పాత్ర ఎంటర్ అవుతుంది. అప్పటి నుండి సినిమాపై ఆసక్తి ఇంకా పెరుగుతుంది.