ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీవారం కొత్త కొత్త చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తుంటాయి. ఈ వారం కూడా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.
అన్ స్టాపబుల్:
వీజే సన్నీ, కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో కనిపించిన ఈ చిత్రం, జూన్ 9న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే ఆద్యంతం నవ్వులు పంచేలా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసారు.
ఢీ ఫేమ్ ఆక్సా ఖాన్ నటిస్తున్న ఈ చిత్రంలో బిత్తిరిసత్తి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఏబీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకు రజత్ రావు నిర్మాతగా ఉన్నారు.
టక్కర్:
సిద్ధార్థ్, దివ్యాంశ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, జూన్ 9న థియేటర్లలోకి వస్తుంది.
Details
డబ్బు చుట్టూ తిరిగే కథ టక్కర్
మనిషిని ఆశే బతికిస్తుందని, ఆ ఆశలు నెరవేరాలంటే డబ్బులు కావాలని, సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నట్టుగా టక్కర్ ట్రైలర్ లో చూపించారు.
విమానం:
విమానం ఎక్కాలనే కొడుకు కల కోసం దివ్యాంగుడు అయిన తండ్రి ఏం చేసాడనేదే ఈ సినిమా కథ. దివ్యాంగుడిగా సముద్రఖని నటించారు.
రాహుల్ రామకృష్ణ, అనసూయ, మీరా జాస్మిన్ నటిస్తున్నారు. శివప్రసాద్ యానాల డైరెక్ట్ చేసారు. జూన్ 9వ తేదీన విడుదల కానుంది.
పోయే ఏనుగు పోయే:
కె. ఎస్ నాయక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఏనుగు పాత్ర కీలకంగా ఉంటుంది. జూన్ 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుంది.