Kanguva : అమెజాన్ ప్రైమ్ లో కంగువా స్ట్రీమింగ్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కంగువ' శివ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పది భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. 'కంగువా' అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న గెటప్‌లలో కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఇప్పటివరకు తెరపైకి రాని కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించబడింది.
సినిమా డిజాస్టర్ గా నిలిచింది
ఈ చిత్రంతో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. జగపతి బాబు, యోగి బాబు, సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించి, సినిమాకు మ్యూజికల్ బలం చేకూర్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది
డిసెంబర్ 12 లేదా 13న వచ్చే ఛాన్స్
సూర్య నటనకు మంచి ప్రశంసలు దక్కినా, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ హక్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. డిసెంబర్ 12 లేదా 13 నాటికి ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం, అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించినట్లు తెలిసింది.