
Jana Nayagan OTT: దళపతి చివరి సినిమాకి రికార్డు ఆఫర్ .. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా జన నాయగాన్ (Jana Nayagan).
ఈ చిత్రం గురించి సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా 2026 జనవరి 9న, సంక్రాంతి పండుగ సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇలాంటి పరిస్థితుల్లో, జన నాయగాన్ సినిమా ఓటీటీ రైట్స్ గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకొచ్చింది.
వివరాలు
భారీ మొత్తం చెల్లించిన అమెజాన్ ప్రైమ్
తాజా సమాచారం ప్రకారం, జన నాయగాన్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హక్కులను రూ.121 కోట్లు పెట్టి దక్కించుకున్నట్లు సమాచారం.
ఈ భారీ డీల్ వెనుక ముఖ్య కారణం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు.
ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందే ఈ సినిమా విడుదల అవుతుండటంతో, దీనిపై ఆసక్తి ఎక్కువైంది.
అలాగే, దళపతి విజయ్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ కూడా ఓటీటీ రైట్స్ భారీ రేంజ్‌లో అమ్ముడుపోవడానికి కారణమైంది.
వివరాలు
పొలిటికల్ థ్రిల్లర్ గా జన నాయగాన్
ఈ సినిమాతో విజయ్ ఓ బలమైన రాజకీయ సందేశం ఇవ్వబోతున్నాడని టాక్.
రాజకీయ నేపథ్యం కలిగిన పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలు కూడా ప్రాముఖ్యత పొందనున్నాయి.
అంతేకాకుండా, ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశముందని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ నేతల దృష్టిని ఆకర్షించిన విజయ్, జన నాయగాన్ ద్వారా మరిన్ని చర్చలకు తెరతీయనున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
అగ్ర తారాగణం - భారీ నిర్మాణ విలువలు
ఈ చిత్రంలో విజయ్ సరసన ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే నటించనుంది.
గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, మమిత బైజు, మోనిషా బ్లెస్సీ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రముఖ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
సంగీతం హిట్ మేకర్ అనిరుధ్ అందిస్తున్నాడు. జన నాయగాన్ సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేయడంతో, సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి!