Thandel: మరోసారి పైరసీ భారీన 'తండేల్'.. ఆర్టీసీ బస్సుల్లో వరుస ఘటనలు
ఈ వార్తాకథనం ఏంటి
'తండేల్' సినిమాను పైరసీ సమస్య వెంటాడుతూనే ఉంది. ఇటీవల పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరోసారి ఓ ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నిర్మాత బన్ని వాసు స్పందిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఆర్టీసీ బస్సులో ప్రదర్శించిన 'తండేల్' సినిమాకు సంబంధించిన వీడియోను, బస్సు టికెట్‌ను బన్ని వాసు షేర్ చేశారు. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
తమ సినిమా మరోసారి పైరసీ బారిన పడిందని, ఇలా జరగడం చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టమన్నారు.
Details
కఠినమైన సర్క్యులర్‌లను జారీ చేయాలి : నిర్మాత
ఎంతో మంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరిచే చర్య ఇది అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్సుల్లో పైరసీ ఫుటేజ్‌లను ప్రదర్శించకుండా కఠినమైన సర్క్యులర్‌లను జారీ చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును బన్ని వాసు కోరారు.
నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'తండేల్' రిలీజ్ అయిన రెండు రోజులకే పైరసీ ప్రింట్ లీకైంది.
ఆర్టీసీ బస్సులో సినిమాను ప్రదర్శించిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా, ఈ వ్యవహారంపై ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ విచారణకు ఆదేశించారు.
ఇప్పుడే మరో బస్సులో సినిమా ప్రదర్శించడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.