
Sai Pallavi: తండేల్ టీమ్ నుండి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అందగాడు నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'.ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రాన్నిఈ ఎడాది డిసెంబర్ 20న థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి భారీ బజ్ నడుస్తోంది. ఫస్ట్ లుక్,టీజర్,ఇతర ప్రోమోలకు కూడా మంచి ఆదరణ లభించింది.
ఈ రోజు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
Details
సాయి పల్లవి ఫ్యాన్స్ కి ట్రీట్
తండేల్ మూవీకి సంబంధించిన చిత్రీకరణ లో సాయి పల్లవి వివిధ ఎమోషన్స్ తో కూడుకున్న వీడియో అది.
ఈ వీడియోని చూస్తే ఈ సినిమాలో ఒక నటిగా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ ఈ చిత్రం లో ఎలా ఉండబోతుంది అనే విషయం అర్థమవుతుంది.
సాయి పల్లవి ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్ అనే చెప్పాలి.
ఇదివరకు, నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో,అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
The calmest wave from the roughest oceans 🌊💓
— Geetha Arts (@GeethaArts) May 8, 2024
A Special Birthday Video of 'Satya' from #Thandel out tomorrow at 9.09 AM ✨#HBDSaiPallavi ❤🔥#Dhullakotteyala 💥💥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind #BunnyVas… pic.twitter.com/oSALKf3u6L